విశ్వహిందూ పరిషత్

About VHP

విశ్వహిందూ పరిషత్ 1964 సంవత్సరంలో సాందీపని సాధనాలయం ముంబైలో జన్మించింది. పూజ్య స్వామి చిన్మయానంద అధ్యక్షతన సిక్కు సాంప్రదాయం మాస్టర్ తారాసింగ్, జైన సాంప్రదాయం ముని సుశీల్ కుమార్ జైన్, డాక్టర్ కె.యం. మున్నీ, సంత్ తుకడోజీ! మహరాజ్, పరమ పూజనీయ గురూజీ గోల్వాల్కర్ లాంటి మహాపురుషుల సాన్నిధ్యంలో ఆవిర్భావం జరిగింది.
              మతమార్పిడుల కారణంగా స్వాతంత్య్రం వచ్చేనాటికి భారతదేశం 70 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న భూమి ఆక్రమణలకు గురై 32 లక్షల చదరపు కిలోమీటర్లకు పరిమితమైంది. నేడు ప్రతి సంవత్సరం 8 లక్షల మంది హిందూ బంధువులు మతమార్పిడికి గురువుతున్నారు. ఇలా జరిగితే మిగిలిన భూమి కూడా మనకు దక్కదు. అందుకే మతమార్పిడిలు ఆపడం అనే ధ్యేయంతో ప్రారంభించడం జరిగింది. అందుకు కారణాలైన ఆస్పృశ్యతను తొలగించడం, సేవా భావాన్ని పెంపొందించి వసుధైవ కుటుంబకం అన్న భావన నిర్మాణం చేయడం, హిందూ ధర్మంలో ఉన్న మహత్తరమైన విషయాలను వాడవాడలా, ఇంటింటా ప్రచారంలోకి తేవడం, విదేశాలలో ఉన్న కోట్లాది హిందూ సోదరులకు మార్గదర్శనం చేయడం లాంటి పవిత్ర ఉద్దేశాలతో సామాజిక సమరసత నిర్మాణం చేస్తూ సమాజంలో సమైక్యత ఆధారంగా హిందూ సమాజంలో ఉన్న వివిధ సంప్రదాయాలకు చెందిన ధర్మాచార్యులను ఒక వేదిక పైకి తెచ్చి అఖండ భారత నిర్మాణానికి కృషి చేయడం.

పై లక్ష్యాలను సాధించడానికి సంస్కార్ సేవా - సురక్షా అనే మూడు రకాల రచనాత్మక కార్యక్రమాలను స్వీకరించి ముందుకు నడుస్తోంది.

సంస్కార్

సంస్కారాలలో దేశభక్తి, దైవభక్తి, మన సంస్కృతి పట్ల శ్రద్ధను నిర్మాణం చేస్తూ పురుషులకు సత్సంగం, మహిళలకు మాతృమండలి, యువకులకు బజరంగల్, యువతులకు దుర్గావాహిని, బాలురకు బాలసంస్కార్ పేరుతో 62 వేల సంస్కార కేంద్రాలు దేశంలో జరుగుతున్నాయి. బజరంగ్ దళ్, దుర్గావాహిని, ధర్మప్రసార్తో సహా మొత్తం లక్ష కేంద్రాలలో కార్యక్రమాలు నడుస్తున్నాయి.

సేవ

దరిద్రాన్ని తొలగించి ఉపాధిని కల్పించడం, అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని అందించడం, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించడం, అసమానతలను తొలగించి సమానతలను తేవడం ఆ రకమైన సేవా కేంద్రాలు ఒక లక్షా పదివేల కేంద్రాలు: నిర్మించింది.

సురక్ష

మన భారతీయ సంస్కృతికి మాన బిందువులైన 'మాత - గోమాత - మాతృభూమి - మర మందిరాలు - ధర్మగ్రంధాలు.

ఆయామ్ / విభాగాలు

Ready to Join VHP?